calender_icon.png 2 September, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రావో వీడ్కోలు

28-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రాంచైజీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయాన్ని వెలువ రించాడు. 2021లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగుల్లో ఆడుతూ వచ్చాడు. 21 ఏళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన బ్రావో ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్నాడు. బ్రావో ప్రాంచైజీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే కేకేఆర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) అతడిని మెంటార్‌గా నియమించుకుంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో బ్రావో ఆఫ్గన్ జట్టుకు బౌలింగ్ కన్సల్టంట్‌గా పని చేశాడు.