30-01-2026 12:00:00 AM
ముంబై , జనవరి 29: బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూసిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బౌతికాకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యా యి. ప్రభుత్వ లాంఛనాలతో బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్‌లో గురువారం దహన సంస్కారాలు నిర్వహించారు. పవార్ పెద్దకుమారుడు తండ్రి చితికి నిప్పంటించారు. అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలుకుతూ ఆయన భార్య సునేత్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
తరలి వచ్చిన రాజకీయ ప్రముఖులు
అంత్యక్రియలకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు తరలివచ్చారు. కేంద్ర హోంమం త్రి అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర రాష్ట్ర మం త్రులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ హాజరై శ్రద్ధాంజ లి ఘటించారు. తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రతిష్ఠాన్ మైదానానికి ప్రజలు పోటెత్తడంతో ఆ ప్రాంతం జనసంద్రా న్ని తలపించింది.
అజిత్ పవార్‌ను కోల్పోయినందుకు పార్టీ నేతలు, అభిమానులు శోకసం ద్రంలో మునిగిపోయారు. అంతిమ యాత్రకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. అభిమాన నేతను తలచుకుని కార్యక ర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియలను ఎంపీ సుప్రియా సూలే పర్యవేక్షించారు. అతిథులను ఆహ్వానించడం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆమె చూసుకున్నారు.
నలుగురి మృతదేహాలు అప్పగింత
బారామతి విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, కో-పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ, మాలీలకు పుణ్యశ్లోక్ అహిల్యాదేవి హోల్కర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు.