09-07-2025 12:29:53 AM
పీసీసీ మెంబర్ ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్
కడ్తాల, జులై 8: రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని డైట్ చార్జీలను, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని రాష్ట్ర పిసిసి మెంబర్ ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం కడ్తాల మండలం లోని మైసిగండి గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రై మరీ హెల్త్ సెంటర్ డాక్టర్ కిరణ్ తో కలిసి సందర్శించా రు. ఈ సందర్భంగా హాస్టల్లో పరిసరాలు పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య సమస్యలను ఆరా తీశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిరుపేద విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు విద్యపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్ర భుత్వ వసతి గృహంలో చదువుకునే విద్యార్థులు ఎక్కడ ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు చెప్పారు.
గత ప్రభుత్వంలో 16 ఏళ్ల నుంచి కాస్మో టిక్ ఛార్జీలు,గత 8 ఏళ్ల నుంచి డైట్ చార్జీలు పెంచలేదని ఆయన విమర్శించారు. పెంచిన డైట్ చార్జీల వల్ల రాష్ట్రంలో 8 లక్షల విద్యార్థులకు లబ్ధి కలుగుతుందన్నారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.5 లక్షల తో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. విద్యార్థులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో నాయకులు జవహర్ లాల్ నాయక్,హీరా సింగ్ నాయక్, తులసిరాం నాయక్, రాము నాయక్,వార్డెన్ బాలరాజ్, హెడ్ మాస్టర్ పాపయ్య, ఉపాధ్యాయు లు భగవతి, సరిత, నహీమోద్దీన్, సంతోష్ కుమార్, వెంకటయ్య, సురేష్, శ్రీశైలం, మంజుల హా స్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.