09-07-2025 12:30:06 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిల్లల పై చదువులకు భరోసా
రాజన్న సిరిసిల్ల: జులై 8 (విజయక్రాంతి) సిరిసిల్ల నియోజకవర్గనికి చెందిన జర్నలిస్ట్ గార్దాసు ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.
ప్రసాద్ గుండెపోటుతో ఇటీవల మృతిచెందిగా విషయం తెలుసుకున్న విప్ మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని, విప్ స్వయంగా 20 వేల రూపాయలను. కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల పై చదువులకు అండగా ఉంటానని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాననిహామీఇచ్చారు.