calender_icon.png 9 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణలను తొలగించండి

09-07-2025 12:28:22 AM

- నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్

కరీంనగర్, జూలై 8 (విజయ క్రాంతి): మంచిర్యాల చౌరస్తా నుండి తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వరకు రోడ్డు, ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి వేయాలని డిఆర్‌ఎఫ్, సానిటేషన్ అధికారులు సిబ్బందిని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం కమీషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలోని మంచిర్యాల చౌరస్తాను సందర్శించి... పారిశుధ్య పనులను తనిఖీ చేసారు. మంచిర్యాల చౌరస్తా నుండి తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వరకు ఉన్న ఫుట్ పాత్, రోడ్డు ఎంక్రోజ్ మెంట్లను పరిశీలించారు.

వాటి తొలగింపు పై డిఆర్‌ఎఫ్, పారిశుధ్య అధికారులకు ఆదేశించారు. అనంతరం తీగలగుట్టపల్లి జెడ్పిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలతో పాటు అంగన్ వాడి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.... నగరంలో రోడ్లు, ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురి కాకుండా అధికారులు సిబ్బంది చర్యలు తీస్కోవాలన్నారు.

మంచిర్యాల చౌరస్తా నుండి తీగలగుట్టపల్లి వరకు రోడ్డును ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హాస్పిటల్స్, స్టీల్ సిమెంట్ దుకాణాలు, ఇతర వ్యాపార దుకాణాలకు జరిమానాలు వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, సానిటేషన్ ఇన్ స్పెక్టర్ నర్వోత్తమ్ రెడ్డి, డిఆర్‌ఎఫ్ సిబ్బంది, తదితరులుపాల్గొన్నారు.