calender_icon.png 11 December, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతారామ్ రెండో భార్యగా..

10-12-2025 01:47:59 AM

భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన సుప్రసిద్ధ దర్శకుడు, నటుడు, నిర్మాత వీ శాంతారామ్ జీవితం ఆధారంగా దర్శకుడు అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ డ్రామాకు ‘వి. శాంతారామ్’గా ఖరారు చేశారు మేకర్స్. రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరిత అశ్విన్ వర్ధే నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్‌లో టైటిల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సిద్ధాంత్ చతుర్వేది ఫస్ట్‌లుక్‌ని ఇప్పటికే విడుదల చిత్ర బృందం తాజాగా కథానాయికను పరిచయం చేసింది.

ఇందులో హీరోయిన్‌గా తమన్నా భాటియా నటించబోతున్నట్టు ప్రకటించారు. తమన్నా ఇందులో శాంతారామ్ రెండోభార్య జయశ్రీగా కనిపించను న్నట్టు నిర్మాతలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. జయశ్రీ రోల్‌లో తమన్నా రెట్రో లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నటి జయశ్రీ అప్పట్లో ‘డాక్టర్ కుట్నీస్ కీ అమర్ కహానీ’, ‘శాకుంతల’, ‘చంద్రరావ్ మోర్’, ‘దహేజ్’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.