05-12-2025 12:00:00 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 4 : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధిలోని శివగంగ కాలనీలో మూగబాలుడు ప్రేమ్ చంద్ పై వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. బాలుడు నీలోఫర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ క్రమం లో గురువారం నీలోఫర్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న బాలుడు ప్రేమ్‌చంద్‌ని సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ పరామర్శించారు.
బాలుడి తల్లిదండ్రులు తిరుపతి రావు, చంద్రకళతో మాట్లాడి, అండగా ఉంటామని, అధైర్యపడొద్దు అని భరోసా కల్పిస్తూ తక్షణ సాయంగా లక్ష రూపాయల చెక్కును మంత్రి అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బాలుడికి స్పెషల్ స్కూల్‌లో అడ్మిషన్ కూడా ఇప్పించి చదువును కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. కోలుకున్న తర్వాత బా లుడికి కావాల్సిన సంరక్షణ సదుపాయాలు పూర్తిగా కల్పించడంతోపాటు వైద్య చికిత్స, పునరావాస కల్పించే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మం త్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజ, గాంధీ ఆసుపత్రి సూపరింటెం డెంట్ బాబురావు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హయత్‌నగర్ లోని శివగంగా కాలనీలో మూగ బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించింది. దినపత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటో కేసుగా స్వీకరిస్తున్నట్లు కమిషన్ ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ తెలిపారు.