calender_icon.png 7 September, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం

06-09-2025 12:00:00 AM

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి  

సూర్యాపేట, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : రైతులకు యూరియా అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యెక్క అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిండ్రన్నారు.

బి ఆర్ ఎస్ హయాంలో ఈనాడు యూరియా కొరత లేదన్నారు. మంత్రులే యూరియా లేదటుంటే.. రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెపుతున్నా రన్నారు. రోజులతరబడి లైన్ లలో నిలబడ్డ రైతులు, మహిళలు కడుపుమండి బూతులు తిడుతుంటే ప్రభుత్వ పెద్దలకు అవి వినపడడం లేదన్నారు. 2014కు ముందు నీళ్లకోసం కొట్టుకున్నోళ్లు.. నేడు యూరియా కోసం  కొట్టుకుంటున్నారన్నారు. ఈ రాష్టంలో పనిచేస్తున్న ఏకైక శాఖ పోలీస్ శాఖ మాత్రమేనని, వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.

వందల టీఎంసీల నీళ్లు ఒకపక్క సముద్రంలో కలుస్తుంటే పట్టించుకోని జిల్లా మంత్రులు ఎస్‌ఎల్బీసీని పూర్తి చేస్తామనడం సిగ్గుచేటన్నారు. సచ్చిన శవాలను తీయడానికి ఇప్పటి వరకు దిక్కులేదన్నారు. కానీ గొప్పలకు మాత్రం తక్కువ లేదన్నారు. ఎప్పటికైనా కోమటిరెడ్డి, సీఎం రేవంత్ బీజేపీ లో చేరేవాళ్లేనన్నారు. ఒకపక్క వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ సీబీఐ,

ఈడిలను తిడుతుంటే వీళ్ళు మాత్రం కాలేశ్వరం ప్రాజెక్ట్ కేసును సిబిఐ కి అప్పగించడంలో అర్థం ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. నీళ్ళల్ల వాటర్ కలుపుతావో.. వాటర్ ల నీళ్లు కలుపుతావో తెలియదు కానీ నల్లగొండ ప్రజలకు మాత్రం నీళ్లు ఇవ్వనన్నారు. ఈ సమావేశంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.