06-09-2025 12:00:00 AM
గద్వాల, సెప్టెంబర్ 5: జోగులాంబ గద్వాల జిల్లాలో ‘మార్వాడి హటావో’ అనే నినాదంపై స్పందించిన జోగులాంబ గద్వా ల జిల్లా వర్తక వ్యాపారస్తులు సంక్షేమ సంఘం సభ్యులు మార్వాడి హటావో’ అనే పిలుపులకు తాము వ్యతిరేకం అని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులు మాట్లాడారు. కల్తీ వ్యాపారాల విషయంలో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించాలని , ప్ర జలు కూడా వీటిని గమనించాలన్నారు.
అ న్నారు. దేశంలో ఎవరు ఎక్కడైనా బ్రతకవ చ్చు, వ్యాపారం చేసుకోవచ్చని కానీ మా ర్వాడి హటావో అంటూ బంద్లకు పిలుపునివ్వడం సరైంది కాదని పేర్కొన్నారు అయితే కల్తీ వస్తువులు తెచ్చి ప్రజలను మోసం చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మాత్రమే కాదు, స్థానిక వ్యాపారులు కూడా ఎవరైనా కల్తీ వ్యాపారం చేస్తే ప్రభుత్వం అటువంటి వారి ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వర్తక వ్యా పారస్తులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మా స్టర్ కుర్వ శ్రీహరి, కార్యదర్శి శ్రీనివాసులాచారి, తదితరులుపాల్గొన్నారు.