19-07-2025 12:16:22 AM
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ జులై 18 (విజయక్రాంతి): ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల నిధులను మంజూరు చేస్తున్నట్టు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ మండలంలోని వెంగాపేట్‌లో ఆరోగ్య సబ్ సెంటర్ ను ప్రారంభిం చారు నిర్మల్ రూలర్ మండలంలోని రానాపూర్ నుంచి గంగాపూర్ వరకు రెండున్నర కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు జిఎన్‌ఆర్ కాలనీ సందర్శించి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో మా జీ జెడ్పి చైర్ పర్సన్స్ వి సత్యనారాయణ గౌ డ్ నాయకులు రావుల రామనాథ్ నాయకు లు రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండ ల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు గంగయ్య, భూషణ్, అనిల్, నరేందర్, శ్రావణ్, నర్సారెడ్డి, మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.