12-07-2025 11:46:13 PM
ఉనికి చెర్లలో స్పోర్ట్స్ స్కూల్, మినీ స్టేడియం..
కాజీపేటలో జాతీయస్థాయి ఖోఖో పోటీలు..
తెలంగాణ ఆయిల్ ఫిట్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి స్వయానా ఫుట్ బాల్ క్రీడాకారుడు కావడంతో క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలంగాణ ఆయిల్ పెట్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగవ రాఘవరెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి కేయు 100 ఫీట్ల రోడ్డును ఆనుకొని ఉన్న శ్యామల గార్డెన్ లో ఫెడరేషన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీ కన్వీనర్ గా సౌత్ జోన్ ఖోఖో అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన జంగా రాఘవరెడ్డి కేకేఎఫ్ఐ ఉపాధ్యక్షుడు సీతారాంరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎన్ కృష్ణమూర్తి, ప్రసాద్ సౌత్ ఇండియా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వై. మహేందర్ రావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. నగర శివారులోని ఉనికి చర్లలో స్పోర్ట్స్ స్కూల్, మినీ స్టేడియం ఏర్పాటు కృషికి చేస్తానని అన్నారు.
స్పోర్ట్స్ స్కూల్, మినీ స్టేడియం ఏర్పాటుకు సహకరిస్తున్న స్టేషన్ ఘాన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా చరిత్రలో తొలిసారిగా సీనియర్ నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిఫ్ ఇంక నా గ్రూపు ఉన్నది కాజీపేట ఆదిత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన ఖో ఖో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జాతీయస్థాయి వేదికగా తెలంగాణ క్రీడాకారులు రాణించేందుకు సుమారు రూ.12 లక్షలతో మ్యాట్లను అందించనున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్లో క్రీడా రంగానికి రూ.465 కోట్లు కేటాయించిందని అన్నారు.
గత ప్రభుత్వం క్రీడా సంఘాలకు అందించవలసిన ఉన్న రూ.12 కోట్లను ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీతారాంరెడ్డి, ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, వరంగల్ ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కత్తి కుమారస్వామి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు బైరబోయిన కైలాష్ యాదవ్, సారంగ పాణి, శ్యామల పవన్ కుమార్, మహమ్మద్ కరీం, పి. రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాంబశివరావు, రాజారావు రమేష్, సురేష్, స్వప్న, రమణ, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, బిల్లా రవీందర్ లతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.