calender_icon.png 2 August, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంగిట్లోకి సర్కార్ వైద్యం

30-07-2025 12:00:00 AM

- ఏరియా ఆసుపత్రిలో రక్త నిధి కేంద్రం

-మంజూరు కలెక్టర్ జితేష్ పాటిల్

మణుగూరు,జులై 29,( విజయ క్రాంతి) : అన్ని రకాల వైద్య సేవలను సర్కార్ ప్రజల ముంగిట్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవతో స్థానిక 100 పడకల ఆసుపత్రికి రక్తనిధి కేంద్రం మంజూరైయిందన్నారు. 

జిల్లాలోని మణుగూరు, అశ్వరావుపేట ఆసుపత్రులలో రేపటి నుండి రక్తనిధి కేంద్రాల సేవలు అందుబాటు రానున్నాయి. రక్తనిల్వ కేంద్రాల ఏర్పాటుతో ప్రసవాలు, ఏదే ని ప్రమాదాలు జరిగినసందర్భంలో రోగులు రక్తం ఎక్కించాలంటే రక్తనిధి నిల్వ కేంద్రాలు లేక ఇబ్బందులు పడేవారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థనతో ఇప్పుడు నూతనం గా ఏరియా హాస్పటల్ లో సైతం రక్త నిల్వ కేంద్రా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రక్త అవస రాల కోసం గర్భిణి స్త్రీలు, రోడ్డు ప్రమాదాలు, అత్యవ సర సమయంలో ఏజెన్సీ ప్రజలు సమీపం లోని భద్రాచలం, కొత్తగూడెం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏరియా హాస్పటల్ లోనే రక్తం అందుబాటులో ఉంటుంది. తద్వారా ఎమర్జెన్సీ సమయంలో తక్షణ చికిత్స అందుతుంది. బ్లడ్ స్టోరేజీ యూనిట్ ఏర్పాటుకు కృషి చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. రవిబాబు కు ఏజెన్సీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.