11-09-2025 12:58:46 AM
రాష్ట్ర రాజధానిలో మంత్రి చేతుల మీదుగా అవార్డ్‌ల ప్రదానం
గద్వాల, సెప్టెంబర్ 10 : గద్వాల ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ ఎస్ వి వి సత్యనారాయణ, మరియు వైస్ ప్రిన్సిపల్ మహమ్మద్ కలీం లను మంగళవారం రాష్ట్ర రాజధాని లో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉత్తమ పురస్కారం అవార్డు లభించింది.
ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి , ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ల నేతృత్వంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఐటిఐ ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపల్ గారికి తెలంగాణ ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.