02-10-2025 01:25:10 AM
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖలో నెలలుగా పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.83.07 కోట్ల బిల్లులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దీని వల్ల పాఠశాలలు, హాస్టళ్లలో వేతనాలు, బిల్లులు బుధవారం క్లియర్ అయ్యాయి.
డైట్ బిల్లులు రూ.55.19 కోట్లు, హాస్టల్ కార్మికుల వేతనాలు రూ.9.44 కోట్లు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో దినసరి వేతన సిబ్బందికి రూ.8.84 కోట్లు, కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు రూ.9.60 కోట్లు విడుదల చేశారు.
ఈ నిధుల మంజూరు పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ బిల్లుల కారణంగాఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బందికి ఇది భారీ ఉపశమనమని మంత్రి పేర్కొన్నారు.