calender_icon.png 10 September, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలివేటర్ల జీఎస్టీపై ప్రభుత్వం పునరాలోచించాలి

10-09-2025 01:22:06 AM

తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ (టీఈఏ)

ఖైరతాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : ప్రస్తుతం ఎలివేటర్లపై ఉన్న 18% జీఎస్టీ విషయంలో పునరాలోచించాలని తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ (టీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీని తగ్గిస్తే దేశంలో అందుబాటులో గృహనిర్మాణంపై సానుకూల ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ మేరకు మంగళ వారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా అవినా ష్, ప్రధాన కార్యదర్శి  బి కే గౌడ్ లు మాట్లాడారు..చిన్న, మధ్యతరహా ఎలివేటర్ ఉత్పత్తిదారులు, ఇన్స్టాలర్లు తెలంగాణలో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు .

ఈ విషయమై ప్రభుత్వనికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రాష్ట్రంలో ఒక నియంత్రణ ఫ్రేంవర్క్ పరిధిలోకి రాకుండానే ఈ పరిశ్రమ  కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గడిచిన  ఏప్రిల్ 12న లిఫ్ట్ చట్టం  తీసుకువ చ్చారని తెలంగాణలోనూ ఇలాంటి విధానం త్వరగా తీసుకురావాలని కోరారు. ప్రత్యేకంగా లిఫ్ట్ చట్టం ఉండడం వల్ల పరిశ్రమ కార్యకలాపాలు క్రమబద్ధం అవుతాయని అన్నారు.

తద్వారా స్పష్టమైన భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు నాణ్యతను అందించవచ్చునని తెలిపారు.ఒక్క హైదరాబాద్లోనే ఇప్పటివరకు 5వేల ఎలివేటర్లు ప్రతినెలా ఇన్స్టాల్ అవుతున్నాయని, సగటున ఒక్కోదానికి రూ.8 లక్షలు ఖర్చవు తుందని అన్నారు. నెలకు  రూ.400 కోట్ల మార్కెట్ ఉందని  తెలిపారు. 18% జీఎస్టీ వంతున ప్రభుత్వానికి ప్రతినెలా రూ.72 కోట్లు వీటినుంచి వస్తోందని తెలిపారు.

అయితే ఇంత పెద్దమొత్తంలో పన్ను వేయ డం వల్ల బడ్జెట్ గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో లిఫ్టులు పెట్టించుకోవడానికి ప్రజలు వెనకాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, పన్నుల విషయంలో కొంత ఊరట కల్పించడంతో పాటు తగిన నియంత్రణపరమైన సంస్కరణలు తీసుకొస్తే ఎలివేటర్ పరిశ్రమకు ఊతం ఇచ్చినట్లు అవుతుందని సంఘ ప్రతినిధులు తెలిపారు.