calender_icon.png 19 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలాం ఆదివాసీలకు అండగా ప్రభుత్వం

19-11-2025 12:06:20 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ

ఉట్నూర్, నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడి కలలు నిజమవుతున్నాయని, ప్రతి ఒక్కరి జీవితం లో స్వంతింటి కల ఉంటుందని ఆ కలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండలంలోని చెరువుగూడలో 53 ఇండ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం భూమి పూజ చేశా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ...  ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  సారథ్యంలో రాష్ట్రం అనేక సంక్షే మ పథకాలతో అబివృద్ధి చెందుతుందన్నా రు. మీకు ఏదైనా సమస్య ఉంటే నా ఇంటికి వచ్చి అడగండి సమస్యకు పరిష్కారం చేస్తా అని పేర్కొన్నారు. దుష్ప్రచారాలను నమ్మి ధర్నాలు చేస్తూ మోసపోవద్దు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.