20-05-2025 12:50:13 AM
ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, మే 19 (విజయ క్రాంతి)ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందించే విధంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ అధికారుల సమక్షంలో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చే యాలన్నారు.
గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడతామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ,ఆర్.సి.ఓ గురుకులం అరుణకుమారి,ఎస్ డి సి రవీంద్రనాథ్,ఎస్‌ఓ భాస్కరన్,ఏపీఓ పవర్ వేణు,డిటి ఆర్‌ఓఎఫ్‌ఆర్ లక్ష్మీనారాయణ, ఎల్ టి ఆర్ డిటి మనిదర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, డి ఎం జి సి సమ్మ య్య, మేనేజర్ ఆదినారాయణ, మిషన్ భగీరథ ఏఈ నారాయణరావు, ఏడీఎంహెచ్‌ఓ చైత న్య,జేడియం హరికృష్ణ,మరియు ఇతర విభాగాల సిబ్బంది నరేందర్, ప్రమీల భాయ్, భార్గవి, జోగారావు, చలపతి తదితరులు పాల్గొన్నారు.