calender_icon.png 12 August, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపుగ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి జూపల్లి

12-08-2025 12:00:00 AM

నాగర్ కర్నూల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): నార్లాపూర్ రిజర్వాయర్ వల్ల ముంపుకు గురవుతున్న గ్రామాల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పునరావాసమే ప్రథమ ప్రాధాన్యత. వసతి, నీరు, విద్యుత్, ఉపాధి వంటి మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, ముంపు గ్రామాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతకుముందు కొల్లాపూర్ పట్టణంలోని పలు కాలనీలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్, భూసేకరణ అధికారి మధుసూదన్ నాయక్, ఆర్డీవో బన్సీలాల్ తదితరులుపాల్గొన్నారు.