04-07-2025 12:57:19 AM
పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్
కడ్తాల, జూలై 3 : గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, పీసీసీ సభ్యుడు, గౌడ సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నా రు. గురువారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో, గీత కార్మికుడు శేషయ్యగౌడ్ పెంచుతున్న ఈత వనాన్ని సీఐ బద్యానాథ్ చౌహన్ తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విరివిగా ఈత, తాటి వనాల పెంపకంకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. కళ్ళు వృత్తిపై ఆధారపడిన కార్మికులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పారు.
గతంలో గీత కార్మికులు కల్లు గీసే సమయంలో పలు ప్రమాదాల బారిన పడిన సంఘటనలను మళ్లీ పునరావతం కాకుండా ప్రభు త్వం వారికి కాటమయ్య రక్షణ కవచం పేరిటా అర్హులైన కార్మికులకు సేఫ్టీ మోకులను పంపిణీ చేస్తుందని ఆయన గుర్తు చేశారు. సిఐ మాట్లాడుతూ గీత వృత్తిని పోత్సహించేందుకు ఈత మొ క్కలను పెంచేందుకు ఉచితంగా ఎక్సైజ్ శాఖ ద్వారా పంపిణీ చేస్తుందని గీత కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న ఈత చెట్లను తమతమ పోలాల్లో, చెరువు కట్టలపై నాటుకోవాలని సూచించారు.
గీతకార్మికులకు లైసెన్సులు లేని వారు అప్లై చేసుకుంటే వారి దరఖాస్తులను పరిశీలించి లైసెన్స్ అందజేస్తామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను గీత కార్మికులు, గౌడ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో మాదారం యాదగిరి గౌడ్, బాలయ్య గౌడ్, నరేష్ గౌడ్, తదితరులుపాల్గొన్నారు.