09-01-2026 12:19:49 AM
ఆదివాసీలను అటవీ శాఖ అధికారుల వేధింపులపై కేంద్ర మంత్రికి వినతి
ఆదిలాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): చట్ట బద్దత లేని లంబాడిలు ఎస్టీలు కాదని, కేంద్ర ప్రభుత్వం తొందరగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాకలు చెయ్యాలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ లో ఆదివాసీ తొమ్మిది తెగల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు చుంచు రామకృష్ణ, ఆధార్ సొసైటీ ట్రేజారర్ మెట్ల పాపయ్య, ఆదివాసీ అడ్వాకెట్ అసోసియేషన్ న్యాయవాదులు అరేం పాపారావు, వాసం ఆనంద్ లు కలిసి కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యుయల్ ఒరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయకేని కలిసి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ... ఆర్టికల్ 342 ప్రకారం చట్టభద్దత లేని లంబాడిలను ఎస్టీలో కలపలేదని దానికి సంబందించిన ఆధారాలను, పార్లమెంట్ కమిటీల నివేదికలను మంత్రులకు అందజేశామన్నారు. ఈనెల 20వ తేదీన వచ్చే తీర్పు కేసు పురోగతిపై సుప్రీంకోర్టు న్యాయవాది అలాంకి రమేష్ తో చర్చించి, రాబోయే రోజుల్లో వ్యవహారించాల్సిన విషయాలపై చర్చించామని వెల్లడించారు.