25-11-2025 12:00:00 AM
గ్రామాల అభివృద్ధికి ఐక్యత అవసరం
175 మహిళాలకు ఉచిత శిక్షణ ధృవీకరణ పత్రం,ఉచిత కుట్టు మిషన్‌ల పంపిణీ
రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
ములుగు,నవంబరు24(విజయక్రాంతి): మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్ర త్యేక దృష్టి పెట్టిందని,గ్రామాల అభివృద్ధికి ఐక్యత అవసరమని,పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులను కుట్టడంతో మహి ళా సంఘాల సభ్యులకు ఆర్థిక బలం చేకూరుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శి శు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మం డలంలోని జగ్గన్నపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రా మీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క,జి ల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలసి సిఎస్‌ఆర్ నిధులతో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన సామాజిక నీటి శుద్ది కేంద్రంను ఉచిత వైద్య శిబిరంను ప్రారంభం,
కోటక్ మహేంద్ర వారి సహకారంతో 175మందికి ఉచిత శిక్షణ ధృవీకరణ పత్రం, ఉచిత కుట్టుమిషనులు, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కురేందుల శంకర్,8మంది ఇతరులకు9యూనిట్లు పాడి గేదెలను (ఒక లక్ష నలుబై వేల రూపాయల సబ్సిడీతో),ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.అనంతరం ఏటూరునాగారం మండలంలోని మహిళా స్వయం సహాయక సం ఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 152 సంఘాలకు9 కోట్ల 50లక్షల రూపాయల ఋణాల పంపిణీ చెక్కులను, కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు 17మంది చెక్కులను మంత్రి అందచేశారు.
కన్నాయిగూడెం మండలంలోని రైతు వేదికలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్, మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.అనంతరం కన్నాయిగూడెం మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు. లింకేజి ద్వారా 102 సంఘాలకు6 కోట్ల 47లక్షల 55 వేల రూపాయల ఋణాల పంపిణీ చెక్కను మంత్రి సీతక్క అందచేశారు.
అనంతరం కన్నాయిగూ డెం మండల పరిధిలోని 16మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ/ షాది ముభారక్ చెక్కు లను మంత్రి అందచేశారు.ఈ సందర్భాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, గ్రామాల అభివృద్ధికి ఐక్యత దోహదపడుతుందని, పాఠశాలల్లో ఏకరూప దుస్తుల ను కుట్టడంతో మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక బలం చేకూరుతుందని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి మహిళల ఆర్థిక అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టిందని, దానిలో భాగంగానే మొట్టమొదటగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం , మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు.
భారతదేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భారతదేశానికి చేసిన కృషి పేద ప్రజలకు చేసిన సేవ సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని ఇందిరా మహిళ సంఘాలను ఏర్పాటు చేసి వారికి అనేక విధాలుగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే గ్రామ ప్రజలలో ఐక్యతగా ఉండాలని , గ్రామాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి రథంలో ముందంజలో ఉంటుందని రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని కోరారు.