calender_icon.png 16 September, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీ విద్యార్థుల రవాణా కష్టాలకు చెల్లు

16-09-2025 12:47:36 AM

- కరీంనగర్ మెడికల్ కాలేజీకి బస్సును అందజేసిన కేంద్ర మంత్రి

- మెడికల్ కాలేజీకి జనరేటర్, ఆర్వో ప్లాంట్లతోపాటు కనీస సౌకర్యాలు కల్పిస్తానని హామీ

- విద్యార్థులతో కలసి బస్సులో బండి ప్రయాణం

కరీంనగర్, సెప్టెంబర్15)విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు రవాణా కష్టాలు తొలిగిపోయాయి. వి ద్యార్థుల కష్టాలను తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. విద్యార్థుల రవాణాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బ స్సును అందజేశారు. ఎంపీ లాడ్స్ నిధులతోపాటు దాతల నుండి సేకరించిన నిధులతో బస్సును ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అందజేశారు.

సోమవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో నూతన బ స్సుకు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆ బస్సులో కేం ద్ర మంత్రి కొద్దిదూరం ప్రయాణించారు. వాస్తవానికి కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెడికల్ కాలేజీ విద్యార్థులుండే హాస్టళ్లు మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. బాలికలకు తీగలగుట్టపల్లిలో, బాలురకు సీతారాంపూర్, దుర్గమ్మగడ్డలో హాస్టళ్లు ఉండటంతో అక్కడి నుండి మెడికల్ కాలేజీకి వచ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి ఇదే విషయంపై మొరపెట్టుకున్నారు.

తప్పనిసరిగా మీ ఇబ్బందుల ను తీరుస్తానని హామీ ఇచ్చిన బండి సంజ య్ ఇచ్చిన మాట ప్రకారం...ఈ రోజు ఎంపీ లాడ్స్ తోపాటు దాతల సహకారంతో నూత న బస్సును మెడికల్ కాలేజీకి అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో ఉన్న ఇబ్బందులను స్వయంగా కేంద్ర మంత్రి సంజయ్ విద్యార్థుల నుండి అడిగి తెలుసుకున్నారు. మంచి నీటి సమస్య ఉందని పేర్కొనగా కాలేజీ, హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తానని చెప్పగా... ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆ బాధ్యత తాను తీసుకుంటానని, త్వరలోనే ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

కరెంట్ లేనప్పుడు మెడికల్ కాలేజీ చీకట్లో మగ్గుతోందని, ఇబ్బంది అవుతోందని విద్యార్థుల పేర్కొనగా అతి త్వరలోనే జనరేటర్ కొనుగోలు చేసి అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్వహణను నెలరోజుల్లో మరో మంచి భవనంలోకి మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమయ్యే వ్యయాన్ని తాను భరిస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. బండి సంజయ్ ఉదారతను మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు ప్రశంసిస్తున్నారు. తాము పడుతున్న కష్టాలను గుర్తించి సా యం చేసేందుకు ముందుకు వచ్చిన కేంద్ర మంత్రికి మెడికల్ కళాశాల విద్యార్థులు క్రుతజ్ఝతలుతెలియజేశారు.