calender_icon.png 7 July, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు భూదాన్ పోచంపల్లికి గవర్నర్

12-06-2025 01:45:13 AM

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ 

యాదాద్రి భువనగిరి జూన్ 11 ( విజయక్రాంతి):  రాష్ట్ర  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నేడు భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా  అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. పోచంపల్లి మండలంలోని టూరిజం పార్కులో గవర్నర్  పర్యటన సందర్భంగా  సంబంధిత   అధికారులతో సమీక్షించారు. 

పోలీస్, రెవెన్యూ శాఖ, చేనేత  మరియు జౌళి శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ,  ఇ ఇ అర్ అండ్ బి ,  ట్రాన్స్ పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయితీ,  ఈ ఈ పంచాయతీ రాజ్, వైద్య శాఖ, ట్రాఫిక్ తదితర శాఖల ఏర్పాట్ల  పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,  డీసీపీ అక్షాంక్ష్ యాదవ్, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ ఎసిపి, ఏ.డి హ్యాండ్ లూమ్స్ ,పోలీస్ అధికారులు ,సంబంధిత శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.