02-12-2025 12:00:00 AM
అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీడీవో శ్రీవాణి
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 1: మండల పరిధిలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శంగా స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీడీవో యూ శ్రీవాణి అన్నారు. జీపీ సర్పంచ్, వార్డు సభ్యుల సెకండ్ ఆడినరీ ఎలక్షన్2025 నిర్వహణపై సోమవారం మండల పరిషత్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల, జీపీ కార్యదర్శులతో ప్రత్యేకమై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం ఎంపీడీవో అధ్యక్షత జరిగింది. ఎన్నికల నిర్వహణలో అనుసరించాల్సిన విధివిధానాలు, ఎన్నికల సమయపట్టిక, పోలింగ్ ఏర్పాట్లు, నిబంధనలు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. జీపీ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, అసిసెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, జీపీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.