calender_icon.png 2 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

02-12-2025 12:00:00 AM

రాజేంద్రనగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ 

మొయినాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరు సహకారం అందించాలని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాకారం క్లస్టర్ ను సందర్శించి ఎన్నికల నిర్వహణ భద్రతా ఏర్పాట్లు, నియమ నిబంధనల అమలు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

నామినేషన్ కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన సమీక్షించారు. అనంతరం డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. ఎన్నికలు స్వచ్ఛందంగా శాంతియుతంగా జరగడానికి పోలీస్‌శాఖ పూర్తిస్థాయి నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన తెలిపారు. ప్రజలు అభ్యర్థులు పోలీసులకు సహకరించి ఎన్నికల నియమాలను పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ గౌడ్, మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.