calender_icon.png 16 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్షికంగా నిలిపివేత

16-09-2025 12:23:44 AM

  1. వక్ఫ్ చట్టంలోని మూడు కీలక ప్రొవిజన్లు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిన సుప్రీం
  2. మొత్తం చట్టంపై స్టే విధించడానికి నిరాకరించిన ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్
  3. రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డుకు ముస్లిం వ్యక్తినే సీఈవోగా నియమించాలని సూచించిన అపెక్స్ కోర్టు
  4. 1923 నుంచి అమల్లో ఉన్న వక్ఫ్ చట్టాలను నిశితంగా పరిశీలించామన్న కోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: వక్ఫ్ చట్టంలోని మూడు కీలక ప్రొవిజన్లను పాక్షికంగా నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం తీర్పును వెలువరించింది. వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం మొత్తం వక్ఫ్ సవరణ చట్టం స్టే విధించడానికి నిరాకరించింది. కొన్ని కీలక సెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వక్ఫ్ సవరణ చట్టంలోని సెక్షన్ (3) క్లాజ్ (ఆర్)ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలు ఇస్లాంలో ఉన్నాడా లేడా అని తెలిపేందుకు రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలు రూపొందించిన తర్వాత మాత్రమే ఇది అమలు చేయాలని పేర్కొంది. అలాగే 3(సీ) సెక్షన్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించొద్దని ఈ నిబంధన చెబుతోంది.

ఈ రెండు మాత్రమే కాకుండా సెక్షన్ 2 (సీ)పై కూడా అపెక్స్ కోర్టు స్టే విధించింది. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుందని ఈ నిబంధన చెబుతోంది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని సుప్రీం అభిప్రాయపడింది. ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే కావడంతో రాజ్యాంగబద్ధతపై పూర్తి విచారణ ఇంకా జరగాల్సి ఉంది.

సోమవారం పలు సెక్షన్లపై స్టే విధించిన సుప్రీం పూర్తి చట్టంపై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. సుప్రీం తీర్పుపై పలువురు పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 1923 నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేసేందుకు ఆధారాలు లభించలేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. మూడు చట్టాలు 3 (సీ), 2 (సీ), 3(ఆర్)లను మాత్రమే నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 

మధ్యంతర ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు

* ఒక వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఇస్లాంను పాటించాడా? లేదా? అని నిర్దారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట నియమాలు రూపొందించాలి. అప్పటి వరకు ఈ క్లాజ్ అమలులో ఉండదు.

* ఆక్రమణ వివాదంపై ప్రభుత్వ అధికారి నిర్ణయం పెండింగ్‌లో ఉన్న సమయంలో వక్ఫ్ భూమి  గుర్తింపును రద్దు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతిస్తూ చట్టంలో నిబంధన పొందుపరిచారు. ఆ నిబంధన కూడా రాజ్యాంగానికి విరుద్ధం. 

* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల సంఖ్య 4 కంటే ఎక్కువ ఉండరాదు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరుల సంఖ్య మూడును మించకూడదు. 

* రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ముస్లిం కాని వ్యక్తి సీఈవోగా ఉండేందుకు అనుమతించే నిబంధనపై స్టే విధించలేదు కానీ సాధ్యమైనంత వరకు ముస్లిం వ్యక్తిని మాత్రమే సీఈవోగా నియమించాలని సూచించింది. 

మొత్తం చట్టంపై స్టే ఇవ్వలేం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మా ట్లాడుతూ.. ‘మొత్తం చట్టంపై స్టే వి ధించడం కుదరదు. అరుదైన సం దర్భాల్లో మాత్రమే ఒక చట్టాన్ని కోర్టు నిలిపివేయగలదు. కాబట్టి ఈ చట్టం పై స్టే విధించలేం’ అని పేర్కొన్నారు.