calender_icon.png 23 October, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

23-10-2025 01:58:24 AM

వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 22(విజయక్రాంతి): మండలంలోని వెంకటాపురం, ఆలుబాక గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పిఏసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల వ్యవసాయ అధికారి నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం ఏ గ్రేడ్ రకం క్వింటాకు రూ. 2389లు, కామన్ రకానికి రూ. 2369లు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది అన్నారు.

ఏడాది ప్రభుత్వం సన్నాలకు అదనంగా క్వింటాకు రూ. 500లు బోనస్ ప్రకటించిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని అమ్మాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ధాన్యాన్ని తేమ శాతం 17 వచ్చేవరకు ఆరబోసుకొని. దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసి, తూర్పార పట్టుకుని కేంద్రాలకు తీసుకురావాలన్నారు.

ధాన్యం తేమశాతం 17 శాతం వచ్చాక సంబంధిత ఏఈఓ ధ్రువీకరించిన అనంతరం టోకెన్ నెంబర్ ఆధారంగా వరుస గ్రామంలో రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని అమ్మాలని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో ఆర్ వి వి సత్యనారాయణ సొసైటీ డైరెక్టర్ పల్నాటి ప్రకాష్, తోట పూర్ణ, సొసైటీ సిబ్బంది, కేంద్రం ఇన్చార్జిలు, రైతులు సతీష్, సన్యాసి, పడకం రమణయ్య, ముమ్మినేని కృష్ణమూర్తి పాల్గొన్నారు.