23-10-2025 01:57:54 AM
రామచంద్రాపురం, అక్టోబర్ 22 :రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా నవంబర్ నెలలో వజ్రోత్సవాలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్, ఎంఈవో పిపి రాథోడ్ తో కలిసి ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన రామచంద్రపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన వేలాదిమంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. నవంబర్ నెలలో పాఠశాల ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా వజ్రోత్సవాల పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.