12-05-2025 12:00:54 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ మే 12 (విజయక్రాంతి) : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను నడిపించాలని సూచిం చారు.
రైతులకు సమస్యలు ఎదురైతే వెంటనే 91829 58858 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని తెలియజేశారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలను అధికారులతో సమీక్షించిన కలెక్టర్, కొనుగోలు ప్రక్రియను మరింత వేగం గా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, కొనుగోలు అనం తరం ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.
ఈ ప్రక్రియలో నిర్ల క్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఎం సివిల్ సప్లయిస్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీసీఓ రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.