calender_icon.png 13 May, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం తీరుతో కాంగ్రెస్‌ను వీడుతున్న నాయకులు

12-05-2025 12:02:29 AM

ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో  చేరికలు

ఆదిలాబాద్, మే 11 (విజయక్రాంతి) : అబద్దపు హామీలు అమలు కానీ హామీలతో అధికార పీఠం ఎక్కిన సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనే భావనతో కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్ లో చేరుతున్నాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని తలమద్రి గ్రామ మాజీ సర్పంచ్ నాగోరావ్, మాజీ ఉప సర్పంచ్ అడేళ్లు వారి అనుచరులు దాదాపు 100 మంది అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం  ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన మాజీ ఉప సర్పంచ్ అడేళ్లు మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నందుకు గర్వం గా ఉందని అన్నారు. అప్పుకోసం వెళితే దొంగళ్ల చూస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడ టం సిగ్గు చేటూల ఉందని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుందని అలాంటిది ముఖ్యమంత్రే రాష్ట్ర పరువును తుంగలో కలుపుతున్నారని ప్రజలు తిరిగి కేసీఆర్‌నే కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీకి ఇకపై భవిష్య త్తు ఉండదని తేలిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.