13-05-2025 12:33:51 AM
వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్
సూర్యాపేట, మే 12 (విజయక్రాంతి) : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొరకు స్థలాన్ని కేటాయించాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయించాలని అన్ని జిల్లాలో కలెక్టర్ లకు మెమోరాండం అందజేయాలని వారు ఆదేశించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26న జరిగిన రాష్ట్ర క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు జిల్లా హెడ్ క్వార్టర్స్ వద్ద భూమిని కేటాయించి అటువంటి కార్యాలయాలకు ఆస్థి పన్ను మినహాయింపు నిర్ణయించిందని తెలిపారు. దానిలో భాగంగానే సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దరఖాస్తు చేశామని కానీ బిఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే స్థలం కేటాయించిందని మిగతా రాజకీయ పార్టీలకు కేటాయించలేదని తెలిపారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో అన్ని జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని ఆశ భావ వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, చింతమల్ల రమేష్, ఎలిమినేటి అభినయ్, తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, నాగుల వాసు, గడ్డం వెంకన్న, అబ్దుల్ రహీం, సిరివెళ్ల శబరినాథ్, అన్నమయ్య రాము, సాయి నేత తదితరులు పాల్గొన్నారు.