calender_icon.png 13 May, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపట్నంలో భారీ ట్రాఫిక్ జామ్

13-05-2025 12:35:01 AM

  1. ఇబ్రహీంపట్నం మీదుగా నాగార్జునసాగర్ బయలుదేరిన

మిస్ వరల్డ్ పోటీదారులు

ఇబ్రహీంపట్నం మే 12 :ఇబ్రహీంపట్నం, బొంగులూరు, పలు ప్రధాన కూడళ్ల వద్ద సోమవారం మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులకు  ఇబ్బందులు తప్పలేదు. ఈ నెల 31 వరకు హైదరాబాద్ లో ఈ ప్రతిష్ఠాత్మ కమైన అందాల పోటీలు జరగను న్న విషయం తెలిసిందే.

కాగా మిస్ వరల్ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న మిస్ వరల్ పోటీదారులు హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా ప్రత్యేక వాహ నంలో నాగార్జునసాగర్ బయలుదేరారు. ఆయా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో వివిధ పనుల మీద వెళ్ళే వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నాడు.