23-04-2025 01:19:53 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 22 ( విజయక్రాంతి)ః వలిగొండ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ను మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా సందర్శించి రైతులతో మాట్లాడారు.నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఓపిఎంఎస్ లో నమోదు చేస్తూ తక్షణం తరలించాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. అకాల వర్షాలు ఉన్నందున రైతులకు ఇబ్బందులు కలగకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టరు వెంట ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.