04-05-2025 01:03:51 AM
గత ఐదేండ్లుగా ప్రభావితం అవుతున్న భారతీయ సెక్టార్స్
న్యూఢిల్లీ, మే 3: క్రెడిట్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్స్ ప్రభావంతో భారతీయ సెక్టార్లు గడిచిన ఐదేండ్లుగా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. దేశీయంగా నిల్వల లోటు, గ్లోబల్ డిమాండ్ షిఫ్ట్స్ మొదలైన సమస్యలతో పలు రంగాలు సతమతం అవుతున్నాయి. టెక్స్‌టైల్ రంగానికి ప్రధానమైన ఈయూ, అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గుముఖం పట్టాయి.
ముడిపదార్థాల ధర జెట్ స్పీడ్‌తో పెరిగిపోయింది. అంతే కాకుండా ఈ రంగానికి చైనా నుంచి పోటీతత్వం కూడా పెరిగింది. ఇక కెమికల్స్ రంగం చైనా ఎగుమతుల వల్ల ధరల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని నిధుల కొరత వెంటాడుతోంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు డెవలపర్స్‌కు నిధుల కొరత సృష్టించింది.
ఇదే సమయంలో రికార్డు సంఖ్యలో గృహాలు అమ్ముడుపోకపోవడం కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీసింది. అమ్ముడు పోని గృహాల సంఖ్య 12 నెలల గరిష్ఠానికి చేరుకుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమలు పారదర్శకతను పెంచింది. మహమ్మారి తర్వాత ఇండ్ల డిమాండ్ పునరుద్ధరించబడింది. 2020 కాలంలో చూసుకుంటే టెక్ట్స్‌టైల్స్ రంగం 32 శాతం, కెమికల్స్ 28 శాతం, రియల్ ఎస్టేట్ 12 శాతం మేర షేర్లు తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగం షేర్ తగ్గడానికి ప్రధాన కారణం నిధుల కొరత.