25-11-2025 12:00:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్మపల్లి) నవంబర్24: విద్యార్థి దశనుంచే సైబర్ నేరాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని స్థానిక ఎస్త్స్ర ఈట సైదులు విద్యార్థులకు సూచించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశానుసారం సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని జెడ్పిహెచ్‌ఎస్‌లో ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, షీ టీమ్స్ పై పోలీసు కళాబృందం చే విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకోవాలేగాని సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురికావద్దన్నారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలుపవద్దని, మెసేజ్లలో వచ్చే బ్లూలింక్స్ ను అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని చెప్పారు. వేధింపులపై100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
ఆకతాయిలు ఆడపిల్ల లను, మహిళలను వేధింపులకు గురిచేస్తే షీ టీం ఫోన్ నెంబర్ 8712686056కి సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అనంతరం పోలీసు కళాబృందంచే పాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు మధుకర్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు, పీడీ మల్లేష్, పోలీసు సిబ్బంది రమణ, మల్లేష్, గోపయ్య, మణి కుమార్, కళాబృందం ఇంచార్జీ ఎల్లయ్య, గోపయ్య, చారి, సత్యం, కృష్ణ, నాగార్జున, గురులింగం, విద్యార్థులు పాల్గొన్నారు.