calender_icon.png 19 November, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

19-11-2025 12:00:00 AM

-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

చిట్యాల,నవంబర్ 18(విజయక్రాంతి): రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్,అందుకు తండా గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

అధికారులు రైతులకు కోతలు లేకుండా ధాన్యాన్ని విక్రయించుకునే విధంగా వెసులుబాటు క ల్పించాలని సూచించారు. రైతులు సైతం తే మ శాతం లేకుండా చూసుకోవాలని చెప్పా రు. ప్రజా ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎ లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.రైతుల ధా న్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత వారికి ఎ లాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలున్న నిర్వాహకులు, అధికారులు చూసుకోవాలని చెప్పారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మా ర్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయ ణ,మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువం శీ కృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్ట య్య, టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్ ,మార్కెట్ సెక్రెటరీ మహమ్మద్ లా షరీఫ్, నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఆరేపల్లి మల్లయ్య, గంగాధరి రవీందర్, అల్లం రాజు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.