19-11-2025 12:00:00 AM
నాగిరెడ్డిపేట్, నవంబర్ 18 (విజయ క్రాంతి): మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తాండూరు గ్రామంలోని త్రిలింగేశ్వర దేవాలయం ఫంక్షన్ హాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పంపిణీ చేశారు.మొత్తం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 65 చెక్కులు మంజూరు కావడంతో వాటిని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ లబ్ధిదారుల సంక్షేమం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సాధారణ ప్రజల జీవన ప్రయాణాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డి, స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ రావు, ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం బాల్రెడ్డి, సంజీవులు, భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జీవరత్నం, లక్ష్మణ్ ఠాగూర్, వాసురెడ్డి, దివిటి కిష్టయ్య, గంగారెడ్డి, నారాయణరెడ్డి, వేముల సంగయ్య, మునిగపల్లి సంగయ్య, మధు, సురేందర్ గౌడ్, వస్రంనాయక్ పాల్గొన్నారు.
విద్యుత్ కొత్త టౌన్ ఫీల్డర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగిరెడ్డిపేట్, నవంబర్ 18 (విజయ క్రాంతి): మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన 33 కె.వి. విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సందర్శించి గ్రామానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొత్త టౌన్ ఫీల్డర్‌ను ప్రారంభించారు. సుమారు 5 లక్షల విలువైన పీడర్ ఏర్పాటు ద్వారా తాండూర్ గ్రామ ప్రజలకు ఇకపై నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని దీనితో విద్యుత్తు అంతరా యాలు గణనీయంగా తగ్గుతాయని ఎమ్మె ల్యే మదన్మోహన్రా వు తెలిపారు.
గ్రామస్తులు తరచు ఎదుర్కొంటున్న కరెంటు కోతల సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా దానితో ప్రత్యేక టౌన్ ఫీడర్ ఏర్పాటు చేయించారు.ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని గ్రామస్తులు అభినందించారు. ఇటీవల పెద్ద ఆత్మకూరు గ్రామానికి చెందిన జిపివర్కర్ బాబా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంలో మరణిం చారు.
వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫు నుండి ఆర్థిక సహాయంగా రూ.5 లక్షల చెక్కును మృతుని భార్య సబేర వేగానికి అందజేశారు.ప్రజల సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ముందున్నాడని గ్రామస్తులు ప్రశంసించారు. తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం నీ సంద ర్శించి సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం రామేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ అంద రికీ స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని శివుని వేడుకున్నారు. ఆలయ కమిటీ అధ్య క్షులు దత్తు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు శ్రీధర్ గౌడ్, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, ఆర్డిఓ పార్థసిం హారెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు గడ్డం బాల్రెడ్డి, సంజీవులు, భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జీవరత్నం, లక్ష్మణ్ ఠాగూర్,వాసు రెడ్డి, దివిటి కిష్టయ్య, గంగారెడ్డి, నారాయణరెడ్డి, వేముల సంగ య్య, మునిగేపల్లి సంగయ్య, మధు, సురేం దర్ గౌడ్, వస్రం నాయక్ పాల్గొన్నారు.