17-05-2025 12:00:00 AM
నాగర్‌కర్నూల్, మే 16 (విజయక్రాంతి): కలుసుకుందాం రా.. అంటూ ఓ మహిళతో ఓ యువకుడు ఫోన్ చేసి పిలిచి మద్యం మత్తు లోకి దించి అత్యాచారానికి పాల్పడి, ఆపై హతమార్చి నగలతో ఊడయించాడు. తీరా సెల్ఫోన్ డేటా ఆధా రంగా పోలీసులకు చికాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా వసంతాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అత్యాచారం హత్య కేసు చేదించిన వివరాలను శుక్రవారం సీఐ కనకయ్య తన ఛాంబర్‌లో మీడియా ముందు వివరించారు.
బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన బోనాసి పరశురాములు, వసం తాపూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే ఇద్ద రు యువకులు లింగసానిపల్లి గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తికి చెందిన జెసిబి ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. కాగా శారీరక సుఖం కోసం ఎవరైనా వేశ్య కావాలంటూ పరశురాము లు కోరడంతో హరీష్ వారి సొంత గ్రామానికి చెందిన పగడాల రాములమ్మ (40) అనే మహిళ సెల్ఫోన్ నెంబర్ ఇచ్చా డు.
పరశురాములు తనతో మాట ముచ్చట చెప్తూ కలుసుకుందాం రా. అంటూ ఈ నెల 11న రాత్రి తన ద్విచక్ర వాహనంతో వసంతాపూర్ గేటు నుండి కుమ్మెర గ్రామ శివారు లోని భీమ్ రెడ్డి మోహన్ రెడ్డి చెందిన పంట పొలాల్లో ఇద్దరు మద్యం సేవించారు. అనంతరం అత్యాచారానికి పాల్పడి హతమార్చి రాములమ్మ శరీరంపై ఉన్న నగలు, సెల్‌ఫోను తీసు కొని పరారయ్యాడు.
ఈనెల 13న ఉదయం కుళ్లిన స్థితిలో శవాన్ని గుర్తించిన పొలం యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలా నికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్ డేటా ఆధారంగా పరశురాములను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
కేసును చేదించిన ఎస్సై గోవర్ధన్, కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ అభినందించినట్లు సిఐ తెలిపారు. వీరి నుండి చెవి కమ్మలు, కాళ్ల పట్టీలు, రెండు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.