06-12-2025 12:00:00 AM
సీఐ పీఎన్‌డీ ప్రసాద్
వేములపల్లి, డిసెంబర్ 5, (విజయ క్రాంతి): ప్రశాంతమైన వాతావరణంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని మిర్యాలగూడ రూరల్ సీఐ పి ఎన్ డి ప్రసాద్ కోరారు. ఈ మేరకు శుక్రవారం వేములపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ ఐ డి వెంకటేశ్వర్లతో కలిసి రాజకీయ నాయకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. ఎన్నికల్లో ఓటర్లను డబ్బు మద్యంతో మభ్య పెడితే చర్యలు తప్పమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రవణ్ కుమార్ పోలీసులు పాల్గొన్నారు.