calender_icon.png 7 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్ర అవార్డులు

06-12-2025 12:00:00 AM

ఎల్బీనగర్, డిసెంబర్ 5 : నాగోల్ - బండ్లగూడ ఆర్టీసీ డిపోలో నవంబర్ నెలలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు శుక్రవారం ప్రగతి చక్ర అవార్డులు, నగదు పురస్కారం అందజేశారు. అత్యధిక ఆదాయం తీసుకుని వచ్చిన కండక్టర్లు, ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెకానికల్ సిబ్బందికి అవార్డులతోపాటు నగదు పురస్కారాలను డిపో మేనేజర్ రమేష్ బాబు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యధిక ఆదాయం తీసుకొని వచ్చి డిపోను లాభాల్లో తీసుకురావడానికి సిబ్బంది కృషి చేయాలన్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు  బస్సులను అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చలికాలం సందర్భంగా ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ రమాదేవి, మెకానికల్ ఇంజినీర్ బాలయోగేశ్వరి, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.