calender_icon.png 8 July, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

08-07-2025 01:06:12 AM

మేడ్చల్ అర్బన్, జూలై 7:మేడ్చల్ పట్టిన పరిధిలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు, ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31 వ సంవత్సరం అడుగుపెడుతు న్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెం డా ఆవిష్కరణ చేశారు. అనంతరం మేడ్చల్ మండల ఇన్చార్జి పరశు రాం మాదిగ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి సహకరించిన మేడ్చల్ మం డలంలోని ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం మేడ్చల్ లో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్పీఎస్ నాయకులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాఘవేందర్ గౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సాటే నరేందర్, మాజీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రామచందర్, యాదయ్య,మేడ్చెల్ కో. ఇంచార్జి జీడిపల్లి శివకుమార్, జిల్లా యువసేన ఉపాధ్యక్షులు వై. బాలనర్సింహా, ఎమ్మెస్ పి జిల్లా కార్యదర్శి జీ. రామ కృష్ణ, వై.బాలకృష్ణ, జి. రాజకుమార్, ఆ నంద్,బాబు, డి.శంకర్, మధుసూదన్, శ్రీను, పద్మారావు, మహేష్, రాజారామ్ వై. నర్సింగరావు, రమేష్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.