03-09-2025 11:25:22 AM
చర్ల,(విజయక్రాంతి): మండల కేంద్రం లోని గణేష్ నగర్(Ganesh Nagar) లో అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిగింది. బొజ్జ గణపతిని భక్తులు కోలిసి మొక్కుకున్నారు, వేద పండితులు శ్రీనివాస శర్మ నేతృత్వం లో ఈ మహా క్రతువు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ హోమం జరిగింది. పెద్ద సంఖ్య లో భక్తులు తరలి వచ్చి దివ్య స్వరూప డైన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్తాయి లో అన్న సంతర్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి చర్ల మండల ప్రముఖులు హాజరై విఘ్నేశ్వరుడి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి గణేష్ నగర్ ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు తెలియజేశారు.