03-09-2025 11:27:08 AM
ఉదయం నాలుగు గంటల నుండి క్యూలో నిలబడ్డ రైతులు
పట్టించుకోని అధికారులు
యాచారం: యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు బుధవారం యాచారం మండలం రైతు సహకార సంఘ కేంద్రంలో యూరియా కోసం రైతులు ఉదయం నాలుగు గంటల నుంచే లైన్ లో వేచి ఉన్నారు. రెండు సంచుల యూరియా కోసం పనులు వదులుకొని ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.