04-09-2025 11:11:42 PM
సిద్దిపేట కలెక్టరేట్: జిల్లా కలెక్టర్ కె.హైమావతి(District Collector Hymavathi) గిరిజన కళాశాల బాలుర వసతి గృహం, మిట్టపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటగదులు, ఆహార నాణ్యతను పరిశీలించి కామన్ డైట్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. భగీరథ నీరు వృథా అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పరిశుభ్రత పాటించాలని, ఉన్నత లక్ష్యాలు సాధించాలనీ ప్రేరేపించారు. తరగతి గదుల్లో లైటింగ్, పరిశుభ్రతపై వార్డెన్ లకు ప్రత్యేక సూచనలు చేశారు.