calender_icon.png 4 September, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యూలైన్లో రైతుల చెప్పులు

03-09-2025 11:23:02 AM

తరిగొప్పుల,(విజయక్రాంతి): యూరియా కోసం అన్నదాతలు(Farmers ) పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు బుధవారం మండల కేంద్రంలో  గ్రోమోర్ గోడం వద్ద పడిగాపులు కాసిన దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తెల్లారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. రైతులు వ్యవసాయ పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి చెప్పులు క్యూలో లైన్లో పెట్టి యూరియా(urea) కోసం నిలుచున్నారు. క్యూలైన్లో నిలుచున్న యూరియా దొరకడం కష్టంగా మారింది.

తరిగొప్పుల మండల వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ధనాతీతం మండలంలోని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సమస్యను తీర్చుతామంటూ పేర్కొంటున్నప్పటికీ రోజు రోజుకి యూరియా అందక రైతులు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కావు తెల్లవారుజాము నుంచి రైతులు యూరియా సరఫరా కేంద్రాల వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. తరిగొప్పుల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు నిలబడి అలసిపోయి చెప్పులను క్యూ లైన్ లో పెట్టిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వచ్చి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుకుంటున్నారు.