04-10-2025 06:46:12 PM
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాయం..
ఆళ్లపల్లి (విజయక్రాంతి): వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు శనివారం ఎమ్మెల్యే వెంకటేశ్వర సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మణుగూరులోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో శనివారం వారిని పార్టీ కండువ కప్పి ఆహ్వానించినట్లు మండల కో ప్రచార కమిటీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో వనపర్తి రమేష్, పోకల మహేష్ రెడ్డి, మల్లరాజు మంద సాయిరాజు, ప్రశాంత్, శ్రీరామ్, సంపత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగస్వాములుగా నూతనంగా యువత కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాబోయే స్థానిక ఎన్నికలలో విజయదుందుభి మోగించడంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఎప్పటికీ తోడుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటిసి పరిక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.