18-12-2024 12:22:39 AM
* రాణించిన హేలీ మాథ్యూస్
* భారత్, విండీస్ రెండో టీ 20
ముంబై: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి టీ20 గెలిచి జోరు మీదున్న భారత మహిళల జట్టుకు షాక్ తగిలింది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో విండీస్ 9 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (62) హాఫ్ సెంచరీతో మెరవగా.. రిచా ఘోష్ (32) పర్వాలేదనిపించింది. అనంతరం వెస్టిండీస్ 15.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (85 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. మూడో టీ20 గురువారం జరగనుంది.
ర్యాంకింగ్స్‌లో మంధాన జోరు
భారత వైస్ కెప్టెన్ సృ్మతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు ప్రదర్శించింది. ఏకకాలంలో మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ చేరుకుంది. వన్డే ర్యాం కింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచిన మంధాన టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకుం ది. బౌలింగ్‌లో హైదరాబాదీ అరుంధతీ రెడ్డి 48 స్థానాలు ఎగబాకి 51వ స్థానం లో నిలిచింది.