18-12-2024 12:26:51 AM
విజయంతో వీడ్కోలు
జంషెడ్‌పూర్: ఉత్తర్‌ప్రదేశ్ ఆర్చర్ మంగళవారం సీనియర్ నేషనల్స్ ఈవెంట్‌లో జాతీయ రికార్డుతో మెరిశాడు. పురుషుల రికర్వ్ సెక్షన్‌లో 692 పాయింట్లు సాధించి చరిత్ర సృష్టించాడు. టోర్నీలో ఏఐపీఎస్‌సీబీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నీరజ్ తొలి ఎండ్‌లో 345 పాయింట్లు, రెండో ఎండ్‌లో 347 పాయింట్లు.. మొత్తంగా 692 పాయింట్లు సాధించాడు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ (687 పాయింట్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డు బద్దలయ్యింది. మహిళల విభాగంలో అంకిత (667 పాయింట్లు) తొలి స్థానంలో నిలిచింది.
* మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి
హామిల్టన్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ 423 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సిరీస్‌ను 1 ఇంగ్లండ్‌కు కోల్పోయినప్పటికీ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన కివీస్ పేసర్ టిమ్ సౌథీకి ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. 657 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 234 పరుగులకు ఆలౌటైంది. జాకబ్ బెతెల్ (76), జో రూట్ (54) అర్థసెంచరీలు సాధించారు. సాంట్నర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 453 పరుగులు చేసింది.
విలియమ్సన్ (153) కెరీర్‌లో 33వ శతకం అందుకున్నాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో సౌథీ న్యూజిలాండ్ తరఫున 107 టెస్టుల్లో 391 వికెట్లు, 161 వన్డేల్లో 221 వికెట్లు, 126 టీ20ల్లో 164 వికెట్లు పడగొట్టాడు. తొలి డబ్ల్యూటీసీ (2020 టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో సౌథీ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2015, 2019 వన్డే వరల్డ్‌కప్స్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడైన సౌథీ 2011 వన్డే ప్రపంచకప్‌లో 18 వికె ట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.