calender_icon.png 12 July, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్

11-07-2025 12:00:00 AM

- 16 అంశాలపై స్టాండింగ్ కమిటీ తీర్మానం

- రూ.5కే అల్పాహారం, రోడ్ల విస్తరణకు ఆమోదం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): నగరంలో పలు కీలక అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు జీహెఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో మొత్తం 14 ఎజెండా అంశాలు, 2 టేబుల్ ఐటమ్స్‌కు సభ్యులు ఆమోదం తెలిపారు. పేదలకు అల్పాహారం అందించేందుకు హెకేఎం చారిటబుల్ ఫౌండేషన్‌తో కలిసి ఇందిరమ్మ క్యాంటీన్ లలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.

లబ్ధిదారుడు రూ.5 చెల్లిస్తే, మిగిలిన రూ.14ను జీహెఎంసీ గ్రాంట్‌గా అందిస్తుంది. ఇందుకు అవసరమైన కంటైనర్లు, ఇతర మౌలిక వసతుల కోసం రూ.11.43 కోట్లు, ఏడాది నిర్వహణకు రూ.15.33 కోట్లు కేటాయించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. వీటితో సహా ౧౬ అంశాలపై స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేశారు.

సమావేశంలో జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, బాత జబీన్, మహాలక్ష్మి, రమన్‌గౌడ్, సి.ఎన్.రెడ్డి, మహమ్మద్ బాబా ఫసియుద్దీన్, వి.జగదీశ్వర్‌గౌడ్, బూరుగడ్డ పుష్ప, జీహెఎంసీ అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సత్యనారాయణ వేణుగోపాల్, సుభద్ర, పంకజ, గీతా రాధిక, మంగతాయారు, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, వెంకన్న పాల్గొన్నారు.