30-10-2024 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 29: అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ కార్యాలయం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా అవినీతి నిర్మూ లన, సైబర్ సెక్యూరిటీ పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించే ప్లేకార్డులతో మంగళవారం కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్‌లో వాక్‌థాన్ నిర్వహించినట్లు బ్యాంక్ తెలిపింది.
జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ నేతృత్వంలో జరిగిన వాక్‌థాన్‌లో డీజడ్‌హెచ్ కనక్‌రాజు, రీజనల్ హెడ్ రామకృష్ణన్, డీజీఎం సురేష్, ఏజీఎంలు సత్యవాణి, గుల్షన్‌కుమార్, విజి లెన్స్ ఆఫీసర్ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వరకూ తమ అన్ని శాఖల్లోనూ సిబ్బందికి, ఖాతాదారులకు, ప్రజలకు వివిధ విజిలెన్స్ అవగాహనా కార్యక్రమా లు నిర్వహిస్తున్నామని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన తెలిపింది.